బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఎప్పటిలాగానే తన స్వగ్రామైనటువంటి బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఆయన సతీమణితో కలిసి వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటు వేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ పదేళ్ల పాలన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధిలోనూ తీసిపోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గులాబీ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.




