భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి బోధన్ పట్టణంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని విజయ మేరీ హై స్కూల్ లో 56వ పోలింగ్ కేంద్రంలో తమ కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేశారు. ఆయన సతీమణి శ్రీదేవి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో మోధీ ప్రభంజనం బలంగా ఇస్తుందని రాబోయే రోజుల్లో మూడోసారి ముచ్చటగా ఆయనే ప్రధానమంత్రి అవుతారని ఎం పి ఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో సైతం బిజెపికి భారీ ఆధిక్యత లభించనున్నదని బిజెపి శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
