Tuesday, February 17, 2026

తాడ్కోల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఏనుగు

బాన్సువాడ నియోజకవర్గంలోని తాడ్కోలు గ్రామ ఎన్నికల బూత్ లో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ కార్యకర్తలతో ఓటింగ్ సరళి పై చర్చించారు.

బాన్సువాడలో శాంతియుతపాలని అందిస్తాం

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత పాలన అందిస్తామని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత పాలకులు ప్రజలపై దౌర్జన్యంగా వ్యవహరించేవారని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి దౌర్జన్యాలకు చరమగీతం పాడమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థికి మెజార్టీ ఓట్లు దక్కాయ్ అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి భారీ ఆదిక్యం లభిస్తుందని ఏనుగు రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular