Tuesday, February 17, 2026

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్

ద్రోణ నిజామాబాద్ బ్యూరో
మే 13 :

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్ లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు ముందే అనేక మంది ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్దకు తరలివచ్చి, క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సైతం ఉదయం వేళలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఐ.టీ.ఐ లోని 206 పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular