వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యాను వర్ధన్నపేట ప్రజలు దీవించండి అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఒక ప్రకటనలో కోరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎలా ఐతే ఆదరించి అభిమానించి నన్ను అత్యధిక మెజారిటీ తో గెలిపించారో అలాగే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కి సీరియల్ నెం.2 కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి భారత రాజ్యాంగాని పరిరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన తాను ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటానని ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
మీ
కేఆర్ నాగరాజు..
వర్థన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి.
