Tuesday, February 17, 2026

దేశం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం

కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలను ఓడించాలి రాష్ట్రములో మాదిరిగానే దేశం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.- రాష్ట్రములో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ మంత్రి సీతక్క కోరారు.
స్వగ్రామం జగ్గన్న పేట
గ్రామములో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.

ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి
మే 13
మంత్రి వర్యులు సీతక్క స్వగ్రామం ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామము లో మంత్రి సీతక్క తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రములో మాదిరిగానే దేశం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దందుకోవాలని చూసే పార్టీలకు ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి దేశములో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు ప్రజలు గమనించాలి . దేశములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.
అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని ప్రజలు కాంగ్రెస్ పార్టీనిఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular