అభయ హస్తాన్ని అందించే పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వంచనగిరిలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఓటుహక్కు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన శక్తివంతమైన ఆయుధమని మంత్రి సురేఖ అన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుని బాధ్యత కలిగిన పౌరులుగా నిలవాలన్నారు. లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, ప్రజల స్వేచ్ఛని కాపాడుతూ, ప్రజలే కేంద్రంగా పనిచేస్తూ, అభయ హస్తాన్ని అందించే పార్టీకే పట్టం కట్టాలని మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధనకై ప్రజలు తమ అమూల్యమైన ఓటును పూర్తి విచక్షణతో వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
