Tuesday, February 17, 2026

మీ అభిమానాన్ని గుండెల్లో దాచుకుంట

ద్రోణ ఖమ్మం జిల్లా బ్యూరో

ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఓటరు చైతన్యం స్పష్టమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 75.19 శాతం ఓట్లతో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం రాష్ట్రంలోనే మేటిగా నిలవడం గొప్ప పరిణామం. ఈ “ఓట్ల సునామీ” సృష్టించిన సరికొత్త చరిత్రలో “నేను సైతం” భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానుఅని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ప్రభంజన శక్తిగా నిలిపేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి, పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కి, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్టా రాగమయి కి, వైరా శాసనసభ్యులు శ్రీ రామదాసు నాయక్ కి, అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ కి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కి, కాంగ్రెస్ గెలుపులో భాగం పంచుకునేందుకు కదం తొక్కుతూ గళం కలిపిన సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలకు, కాంగ్రెస్ తో కలిసి నడిచిన తెలుగు దేశం పార్టీ తమ్ముళ్లకు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో శ్రమించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెళుతూ నాకు మరింత ప్రాచుర్యం కల్పించిన ప్రింట్ $ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారాన్ని మరువలేను. పార్టీపై ప్రేమతో, నాపై అభిమానంతో బహిర్గతం అవ్వకుండా నాకు వెన్నుదన్నుగా నిలిచిన అజ్ఞాత కార్యకర్తలకు సైతం రుణ పడి ఉంటా. వేసవి ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు కోసం పోటెత్తిన ఓటరు మహాశయులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాపై కురిపించిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను. ఈ ఎన్నికల సాక్షిగా మీతో పెనవేసుకున్న ఆ బంధాన్ని, అనుబంధాన్ని జీవిత కాలం కొనసాగిస్తానని మాటిస్తున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular