Tuesday, February 17, 2026

నాకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నరెడ్డి భరత్ చంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ మీడియాతో మాట్లాడారు.గత రెండు నెలలుగా నాకోసం, నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన మహబూబాబాద్ పార్లమెంటు ఇంఛార్జి మంత్రి,పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలకు,కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు, మిత్రపక్షాలకు,మీడియా మిత్రులకు ప్రతీ ఒక్కరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తెలిపారు. జూన్ 4 న వెలువడే ఎన్నికల ఫలితాలలో తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో, వారి అండదండలతో, దీవెనలతో నేను ఎంపీగా గెలుస్తున్నాను. ప్రజల అభిమానమే నాకు బలం ఆ బలంతోనే అత్యధిక మెజారిటీతో మహబూబాబాద్ ఎంపీ గా గెలుస్తున్నాను, నా కోసం కష్టపడిన ప్రతీ ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాను. ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ,డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మరియు బ్లాక్ కాంగ్రెస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular