తొర్రురు పట్టణంలోని రెడ్డి గార్డెన్లో WETA సంస్థ ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు నిర్వహించిన WETA ఫౌండర్ పాలకుర్తి ఇంచార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి.
మాతృదినోత్సవ వేడుకల సందర్భంగా మాతృమూర్తులందరికి సన్మాన కార్యక్రమం నిర్వహించిన శుభాకాంక్షలు తెలిపిన ఝాన్సి రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని, WETA ఫౌండర్ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మలందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, WETA సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు చేసాం, పాలకుర్తి నియోజకవర్గంలో కూడా సేవలు సచేస్తున్నాము అని గుర్తు చేశారు.గ్రీస్ లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్ గా భావించి ఏడాదికొసరి నివాళి అర్పించేవారు, 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సావాని జరిపేవారు అని గుర్తు చేశారు.
1872 లో జులియవర్డ్ హొవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించారు, అదేవిదంగా అన్న మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్ షిప్ డే జరిపేందుకు ఎంతో కృషిచేసింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళలు, అమ్మలు, అమ్మమ్మలు, తదితరులు, పాల్గొన్నారు.








