Tuesday, February 17, 2026

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం

ద్రోణ ఖమ్మం బ్యూరో

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య టెన్షన్‌ లో ఉన్నారు.శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఈ కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్ వే పై నిలిచిపోయింది విమానం.
ప్రయాణికుల్లో రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular