Tuesday, February 17, 2026

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ

ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రజలు

కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని, అది నిరంతరం ప్రక్రియ అని అన్నారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని.. కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉందన్నారు. రేపటి నుండి సచివాలయానికి వెళ్తానని.
పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెడతానని చెప్పారు. ఎన్నికలకు ముందు సెక్రటేరియట్‌కు వెళ్తే విమర్శలు వస్తాయనే వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అత్యవసర అంశాలపై నిర్ణయాలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డురాదని చెప్పారు. ప్రతి అంశాన్ని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇక, ఏపీలో ఎవరూ అధికారంలోకి వచ్చినా ఇరురాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular