Tuesday, February 17, 2026

బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టారు

ద్రోణ ఉమ్మడి నిజాంబాద్ బ్యూరో

జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
బిడ్డ బెయిల్ కోసం కెసిఆర్,బిఆర్ఎస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి తాకట్టు పెట్టారు.పార్టీని, క్యాడర్ ను తెలంగాణ ప్రజల నమ్మకాన్ని బీజేపీకి అమ్మేశారు.
కేసీఆర్ కు సెక్యులరిజంపై మాట్లాడే హక్కు లేదు.
మతతత్వ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు.కేసీఆర్ ఆరెస్సెస్ ఏజెంట్.జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ కామారెడ్డిలో బంపర్ మెజారిటీ వస్తుంది.10-12 వేల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ సర్వే, మండల అధ్యక్షుల నివేదిక ద్వారా వెల్లడైంది.మాచారెడ్డి మండలంలో 4 వేలు, పాల్వంచ మండలంలో 2500, రామారెడ్డి 1500, బిబిపేట 2500-3000, దోమకొండ 1000, బిక్కనూర్ 4000, రాజంపేట 500, కామారెడ్డి రూరల్ 500+, కామారెడ్డి టౌన్ 3-4 వేల మెజారిటీ ఉంటుందని అంచనా.రాష్ట్రంలో గెలువబోయే 11 స్థానాల్లో జహీరాబాద్ ఉంటుందని సీఎం చెప్పారు.కామారెడ్డిలో కొంచెం బీజేపీ గాలి ఉంది.జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోల్ లో కాంగ్రెస్ మెజారిటీ వస్తుంది.
గత కొద్దిరోజుల నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్తూ వస్తున్నాం.కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ అంటకాగుతున్నారని చెప్పినా నమ్మలేదు.ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో అది నిజమని నిరూపణ అయింది.
మెజారిటీ గ్రామాల్లో కిందిస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేశారు.
తమది రీజనల్ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్ పార్టీ భవిష్యత్తు 5 నెలల్లోనే భూస్తాపితం అయింది.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రమే నాయకుల తీరుతో బిజెపికి ఓటు వేయించారని అనుకున్నాం..కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇదే జరిగింది.
మోడీకి నార్త్ ఇండియాలో ఎదురుగాలి ఉంది. సౌత్ ఇండియాలో ప్రజలు క్లియర్ గా ఉన్నారు.షెడ్యూల్ 71, 72, 73 ప్రకారం ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లు మార్చాలి.
కేసీఆర్ మొండిగా దానిని పదేళ్లకు పెంచారు.మార్చి నెలలో కురిసిన రాళ్ళ వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది.
ఎన్నికల కమిషన్ అనుమతితో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం కామారెడ్డి నియోజకవర్గంలోనే 10,420 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.
ఎకరానికి 10 వేల చొప్పున ప్రభుత్వం 15 కోట్లు విడుదల చేస్తే 10 కోట్లకు పైగా కామారెడ్డి రైతులకు నష్టపరిహారం ఇచ్చాం.పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రైతుకు పంట నష్టం ఇవ్వలేదు.గతంలో వైఎస్ఆర్ హయాంలో పరిహారం ఇస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.మొన్నటి ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి సమస్యలపై మెమోరాండం ఇచ్చాను.ప్రాణహిత 21,22 ప్యాకేజి పనులకు నిధులు విడుదల చేయాలని కోరిన,
కామారెడ్డిలో డ్రింకింగ్ వాటర్ కోసం ప్రత్యేక పైప్ లైన్ వేయాలని విన్నవించినా,
కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ కోసం పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల, దోమకొండకు డిగ్రీ కళాశాల, నర్సింగ్ కాలేజ్, డెయిరీ టెక్నాలజీ పిజిగా మార్పు, పారామెడికల్ కాలేజ్, ఐటీ హబ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఇవ్వాలని కోరడం జరిగింది.
అలాగే రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, నూతన బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్, గ్యాలరీ, సౌత్ క్యాంపస్ లో అదనపు కోర్సులు, దోమకొండ 100 పడకల ఆస్పత్రి, ఆటో నగర్, టూరిజం ఇవ్వాలని కోరడం జరిగింది.ఎన్నికలా కోడ్ ముగిసిన తర్వాత సంబంధిత శాఖల మంత్రులతో స్వయంగా సమీక్షిస్తా.పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేయిస్తా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular