Wednesday, February 18, 2026

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి

బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్‌ స్కామ్‌ కేసులో TDP నేత JC ప్రభాకర్‌ రెడ్డిపై ఈడి ఛార్జ్‌షీట్ ఫైల్‌ చేసింది.

హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. BS-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయినప్పటికీ, జెసి ప్రభాకర్ రెడ్డి,గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లీలాండ్ లిమిటెడ్ నుండి BS-3 వాహనాలను జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, C. గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.నకిలీ పత్రాల ఆధారంగా BS-4 వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని EC ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ భాగం నాగాలాండ్‌లో జరుగగా, కొన్ని కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగాయని తెలిపింది.
జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని BS-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు.
అలాంటి కొన్ని వాహనాలను BS-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించారని ఈడి పేర్కొంది .అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడి అటాచ్ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular