Wednesday, February 18, 2026

ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఈ నేపథ్యంలో సీఈఓ బుధ‌ వారం ప్రెస్ మీట్‌ నిర్వహించి పోలింగ్‌ వివరాలను వెల్లడిం చారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంట‌లు దాటాక కూడా పోలింగ్ కొన‌సాగింద‌ని చెప్పారు. ఆఖ‌రి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంట‌ల‌కు పోలింగ్ ముగిసిన‌ట్లు తెలిపారు.మొత్తంగా 81.86 పోలింగ్ న‌మోదైన‌ట్లు స్ప‌ష్టం చేశా రు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్ట‌ల్ బ్యాలెట్‌తో 1.2 శాతం న‌మోద‌యిన‌ట్లు తెలిపారు.
గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగింద‌న్నారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం న‌మోదైంద‌ని చెప్పారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో 90.91 శాతం పోలింగ్ న‌మోదైతే, అత్య‌ల్పంగా తిరుప‌తిలో 63.32 శాతం న‌మోద‌యి న‌ట్లు తెలిపారు. పలు చోట్లు హింసాత్మక ఘటనలు నెలకొన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటా మ‌న్నారు. ఆయా నియోజక వర్గాల్లో చెదురుమదురు ఘటనలు తప్పా, ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింద న్నారు. రీపోలింగ్ ఫిర్యాదులేవీ రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈవీఎం ల‌న్నిటినీ 350 స్ట్రాంగ్ రూముల్లో భ‌ద్ర‌ప‌రిచామ‌ న్నారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్దందికి ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలియ‌జేశారు. జూన్ 4వ‌ తేదీన ఫలితాలు వెలువడుతాయని సీఈవో మీనా తెలిపారు.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా

అల్లూరి సీతారామరాజు 72..20 శాతం

అనకాపల్లి 83.84 శాతం

అనంతపురం 81.08 శాతం

అన్నమయ్య 77.83 శాతం

బాపట్ల 85.15 శాతం

చిత్తూరు 87.09 శాతం

అంబేద్కర్ కోనసీమ 83.84 శాతం

తూర్పు గోదావరి 80.93 శాతం

ఏలూరు 83.67 శాతం

గుంటూరు 78.81

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular