దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం.
ద్రోణ అమరావతి ప్రతినిధి
క్షతగాత్రులను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందినవారిగా గుర్తింపు.దాదాపు 25 మంది భక్తులు బుధవారం రాత్రి 2 బొలెరో వాహనాల్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయల్దేరి వెళ్లారు.
శ్రీశైలానికి 15 కిమీ దూరంలో అందులోని ఒక వాహనం బోల్తా పడింది.సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
