సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ బందెల నరసయ్య కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అకాల మరణం చెందినారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.
నరసయ్య రాష్ట్రంలోని అనేక జిల్లాలలో దళిత దళితక్కుల పోరాట సమితినీ విస్తరింపజేస్తూ దళితుల ఆత్మగౌరవ ఇమ్మడింపచేస్తూ దళిత ఉద్యమాన్ని నిర్మించాడు గత రాష్ట్ర మహాసభలో డిహెచ్పిఎస్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు అంతేగాకుండా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిర్వహించిన పోరాటాలను క్రియాశీలంగా పనిచేయటం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 9-5-2024, గురువారం మరణించడం జరిగింది . ఈ కామ్రేడ్ మరణం దళిత హక్కుల పోరాట సంఘానికి మరియు దళిత ఉద్యమం కు తీవ్రని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, ఏ ఐ యస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అధ్యక్షురాలు అంజలి, డి హెచ్ ఎఫ్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ ముత్యాలు, కోశాధికారి పి నర్సింగరావు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొంబాయి గంగన్న మోపాల్ సిపిఐ మండల కార్యదర్శి మేకల సాయిలు పాకాల రవి , శ్రీను, వాగ్ మార్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
