Wednesday, February 18, 2026

సాఫ్ట్ బాల్ క్రీడాకారినిలకు దుస్తులు అందించిన బెజ్జూర్ ఎంపీటీసీ

ద్రోణ ఆదిలాబాద్ ప్రతినిధి

బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎలుకపల్లి గ్రామంలో ప్రారంభమైన సాఫ్ట్ బాల్ సమ్మర్ క్యాంప్ క్రీడాకారిణిలకు బెజ్జూర్ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా తెలంగాణ జావిద్ ఉచితంగా క్రీడా దుస్తులను అందించడం జరిగింది. సాఫ్ట్ బాల్ క్రీడాల నిర్వాహన కోసం మహేష్ టెంట్ హౌస్ వారు ఉచిత క్యాంపు నిర్వహించిన అన్ని రోజులు తమ టెంట్ హౌస్ మరియు వాటర్ ప్లాంట్ ద్వారా నీటిని క్రీడాకారుల సౌకర్యం టెంటును తదితర వాటిని ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు.మరియు క్రీడా సామాగ్రికి బెజ్జూర్ జడ్పిటిసి వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారిణిల క్రీడా స్ఫూర్తి మరియు వారి నైపుణ్యాన్ని పెంపొందించుటకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములు స్థానిక ఎంపీటీసీ పరిధిని సుల్తానా తెలంగాణ జావీద్ జడ్పిటిసి పందరం పుష్పలత బిక్షమయ్య మహేష్ టెంట్ హౌస్, తంగడపల్లి మహేష్ మరియు పీఈటి చెంచులక్ష్మి స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంద్రం పుష్పలత, బెజ్జూర్ ఎంపీటీసీ పర్వీన్ సుల్తాన్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ డోకి వెంకన్న టి.సునీత కేజీబీవీ బెజ్జూర్,క్రీడ నిర్వాహకులు కే.చెంచులక్ష్మి పి.ఈ.టి కే.జి.బి బెజ్జూర్ నాయకులు తెలంగాణ జావిద్, తంగడపల్లి మహేష్, కొట్రంగి రామకృష్ణ, కొట్రంగి భీమ్రావు, కావిడే సురేష్, పురం వైకుంఠం, ఎర్ర శ్రీకాంత్, మూస అరుణ్, నానబోయిన భీమన్న, కోగునూరు తిరుపతి, జటారి రోశయ్య, బక్కన్న రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular