ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ కట్ట వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ అన్న ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్న సూచనల మేరకు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఆర్మూర్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని, రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించి, మోసం చేశారని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ నీ రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు, వెంటనే తడిచిన ఓట్లను కొనుగోలు చేయాలని అలాగే ప్రకటించిన బోనస్ ని అన్ని రకాల బియ్యానికి ఇవ్వాలని ఇవ్వని ఎడల ఊరుకోమని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణ జ్యోతి, సీనియర్ నాయకులు సుంకర రవి సొసైటీ వైస్ చైర్మన్ నర్మెల్ నవీన్ యువజన కమిటీ అధ్యక్షులు గుంజేటి పృథ్వీరాజ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జన్నెపల్లి రంజిత్ మండల యువజన కమిటీ అధ్యక్షులు అగ్గు క్రాంతి ఆలూరు మాజీ ఉపసర్పంచ్ ధర్మాజీ శ్రీను మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ జిల్లా యువజన నాయకులు మీర శ్రావణ్ , అఖిల్, కాపల్లి గణేష్, మహిళా నాయకురాలు లక్మి , మౌనిక , రాధ, లత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
