కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వగా, మిర్యాలగూడ పట్టణం, రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్, మాజీ ఎంఎల్ఏ తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని, అదికారం కోసం రైతాంగాన్ని మోసం చేసి, మరొక సారి రైతాంగాన్ని మబ్య పెట్టి, ప్రభుత్వాన్ని దీనా స్థితిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడపడం శోచనీయం అని .. రైతే రాజు అని రైతుని మోసం చేసి, మరొక్క సారి ఆత్మహత్యల తెలంగాణ గా మార్చాలని చూస్తున్నారు అని అన్నారు.అనంతరం అన్నీ రకాల వడ్లకు 500 బోనస్ ప్రకటించి, రైతాంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పట్టణంలోని మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఇట్టి నిరసనలో నల్లగొండ జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం, పట్టణ మహిళా విభాగం అద్యక్షురాలు పెండ్యాల పద్మ, వైస్ ఎం.పి.పి అమరావతి సైదులు, వ్యవసాయ మార్కెట్ మాజీ ఛైర్మన్ & వైస్ ఛైర్మన్లు చిట్టిబాబు నాయక్, యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, కొ ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాక్స్ మాజీ ఛైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు కరీం, పునాటి లక్ష్మీ నారాయణ, తలకోన శ్రీధర్ రెడ్డి, సాదినేని శ్రీనివాస్, చాంద్ పాషా, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, అంజన్ రాజు, గుడిసె దుర్గా ప్రసాద్, ఘంట శ్రవణ్ రెడ్డి, కార్మిక విభాగ అద్యక్షులు అంజయ్య, కోదాటి రమా, పట్టణ వార్డ్ అద్యక్ష, కార్యదర్శులు, ఎం.పి.టి.సిలు మాజీసర్పంచ్లు, మరియు బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.



