ద్రోణ డిల్లీ బ్యూరో
దిల్లీ: దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని, వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు.
