ద్రోణ బోధన్
నేషనల్ డెంగ్యూ డే ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా డిప్యూటీ మెడికల్ మరియు హెల్త్ అధికారి డాక్టర్ విద్యా బోధన్,పానగల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో పాల్గొన్నారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. అనుమానిత కేసులను రక్త పరీక్ష నిమిత్తమై పంపాలని కోరారు. కాళీ సీసాలు కొబ్బరి బోండాలు టైర్లు మొదలైన వాటిని పరిశీలించి నీరు నిలవలెకుండా ఉండాలని అవగాహన కల్పించారు. పట్టణం లోని నీరు నిలువ ఉండే ప్రదేశాల జాబితా తయారు చేసి బోధన్ మున్సిపాలిటీ వారి దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సమత మెడికల్ ఆఫీసర్ పానుగల్లి మరియు ఆరోగ్య కార్యకర్తలు ఆశ వర్కర్లు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి డెంగీ పై అవగాహనా కలిగించాలని. ఆరోగ్య, ఆశా కార్యకర్తలను ఆదేశించారు.
