Wednesday, February 18, 2026

ఎడపల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఉపాధి హామీ పథకంలో రోజువారీ చేస్తున్న కూలీలకు మన మండల పరిధిలో వేలాదిమంది పనిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము ఇటీవల పార్లమెంట్ లో ముడు వందల కూలి ఉపాధి కూలీలకు చెల్లించాలని నిర్ణయించడం జరిగింది కానీ రెండు వందల లోపే రోజువారి కూలి ఒక్కొక్కరికి రావడం జరుగుతున్నది కనీసం ధరలకు అనుకూలంగా ముడు వందల రూపాయలు ఏమాత్రం సరిపోవు రోజు రోజుకు ధరలు ఆకాశం అంటుతున్నాయి. ఆరు వందల రూపాయలు రోజువారి కూలి చెల్లించాలని కొలతలు లేకుండా పని కల్పించాలని ప్రతి మనిషికి రెండు వందల పది దినాలు కల్పించాలని ఒక జాబ్ ఉంటే ఇంట్లో నలుగురు పని చేస్తుంటే ఇరువై ఐదు పని దినాలు మాత్రమే సంవత్సరంలో కల్పించబడుతున్నది. ఇది ఏమాత్రం సరిపోదు కాబట్టి రెండు వందల పది దినాలు కల్పించాలి. కొత్త జాబ్ కార్డులు మంచినీటి సౌకర్యం కల్పించాలి దెబ్బ తగిలితే మందు కిట్లు కల్పించాలి పనిముట్లు కల్పించాలి కి కూలికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తరఫున కూర్చున్నాం

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నిరుపేదలకు రేషన్ కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కొత్తగా వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇల్లు నిర్మాణం కోసం కు లోన్ ఇస్తామని అట్లాగే పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు పది వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ రెండు లక్షల రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇవేమీ అమలు కావడం లేదు.

అలాగే మన బోధన్ ఫ్యాక్టరీని ప్రభుత్వము నడిపిస్తామని వాగ్దానం చేసింది. కాబట్టి ప్రభుత్వం మిచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం ఇందులో అఖిలభారత ప్రగతిశీల .రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ .శ్రీపతి మల్లేష్, సుదర్శన్. మండల నాయకులు కే రవి. వైద్యనాథ్ .లక్ష్మణ్ .సాయిలు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular