బోధన్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రి పై ఫిర్యాదు
బోధన్ లో మైనర్ బాలికకు అబార్షన్?
బోధన్ పట్టణానికి చెందిన ఓ బాలిక మోసానికి గురై గర్భం దాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితులలో గర్భస్రావం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గర్భస్రావానికి నిరాకరించడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు. కానీ సదరు బాలిక తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా బోధన్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. అబార్షన్ అనంతరం కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. అనంతరం ప్రవేటు ఆసుపత్రి వైద్యులను పోలీసులు విచారించినట్లు తెలిపారు. సదరు ప్రైవేటు వైద్యుడు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తమ ఆసుపత్రిలో అబార్షన్లు చేయడానికి వెనుకాడకుండా ముందుకు వచ్చాడు. అర్హత లేని సిబ్బంది ఆసుపత్రిలో ఉంచుకొని ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు ప్రైవేటు వైద్యశాలపై పలు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాత్రం ఎటువంటి చర్యలు చేపట్ట లేకుండా ఉండడం దీనిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వైద్యుల ఇష్టానుసారం వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఉంటున్నారు. ఇవే కాకుండా ఫార్మసీలు ఒకరి పేరు మీద సర్టిఫికెట్ ఉండడం మరొకరు దానిని నిర్వహించడం.

సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి మాత్రం ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వేరే వారితో ఫార్మసీలు ఏర్పాటుచేసి నడపడం అనేది మెడికల్ ఆఫీసర్ ఎక్కడ చూసినా ఫార్మసీలకు అనుమతులు మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న అపవాదులు ఉన్నాయి.వాటిని ఎంక్వయిరీ చేయకుండా ఇష్టానుసారంగా నడుపుతున్నారని జనరిక్ మెడిసిన్ తీసుకొని ఫార్మసీలలో అమ్ముతున్న వాటిని పట్టించుకొనే నాధుడు కరువయ్యారు. మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తున్నారని ఎక్కడ చూసినా ఫార్మసీలు కుప్పలు కుప్పలుగా కనబడుతున్నాయి .దీనిపై వెంటనే విచారణ ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
