జిల్లా కలెక్టర్ శివ శంకర్ బదిలీ-
జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సస్పెన్షన్ – శాఖపరమైన విచారణకు ఆదేశం
ద్రోణ అమరావతి బ్యూరో
కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. పోలింగ్.. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినప్పటికీ.. అక్కడ బందోబస్తు ఎందుకు కఠిన తరం చేయలేదని ప్రశ్నించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకొని
ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు విఫలమయ్యారు. పాలనయంత్రంగానికి సంబంధించిన కలెక్టర్ శివశంకర్ అన్ని ప్రాంతాలపై అవగాహన చేసుకుని… ఏ ప్రాంతాలు ఏ చర్యలు తీసుకోవాలో సూచించాల్సి ఉంది. అదేవిధంగా పలనాడు ప్రాంతం అంటేనే కక్షలు కార్పన్యాలతో ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలకే ఘర్షణలు చోటుచేసుకునే ఈ ప్రాంతం పై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఈ చర్యలు ఏమి తీసుకోకుండా ఎస్పీ వ్యవహరించారన్న భావనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్ రోజు పల్నాడు ప్రాంతంలో మాచర్ల,గురజాల నియోజకవర్గాలలో దాడులు ప్రతి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై పార్టీల నేతలు స్థానిక పోలీసులకు ఎస్పీకి ప్రచార అందించినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొన్ని నియోజకవర్గాలలో ఘర్షణలు జరుగుతున్నాయని పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు స్పందించకుండా ఉన్నారు. ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ పరిస్థితి ఎలా ఉంటే, నియోజకవర్గంలో ఉన్న సిఐలు కూడా ఎస్పీ బాట పట్టారని నాయకుల ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం కారణంగా పోలింగ్ రోజు తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా పోలింగ్ రోజు రాత్రి అనేకమంది వైసిపి నేతలు ఇళ్లపై దాడులు చేశారు. గ్రామంలో ఎవరికి బలముంటే వాడు దాడులు చేసుకున్నారు. ఈ విషయాలపై స్థానిక నేతలు ఎన్ని మార్లు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపణలు వెలువత్తాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న దాడులు ప్రజలను తీవ్ర భయాందోళన గురిచేస్తున్నాయి. గురజాల నియోజకవర్గం లోని మాచవరం మండలం కొత్త గనేశునిపాడు, దాచేపల్లి మండలంలోని మాదనపాడు, కేసనపల్లి లో దాడులు జరిగాయి. వైసిపి నేతల ఇళ్లపై చేయడమే కాకుండా, ఇంట్లో ఉన్న వారిని శతకబాదారు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి లో ప్రధాన పార్టీల కార్యాలయాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. అనేకమంది గాయాలయ్యాయి. బుధవారం దాచేపల్లి మండలంలోని మాదినపాడు లో వైసిపి కి చెందిన నేతపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మేరకు సిఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించి వివరణ అడిగింది. పూర్తిస్థాయి నివేదికలు తీసుకున్న తర్వాత తర్వాత పల్నాడు జిల్లాకు చెందిన శివశంకర్ బదిలీ వేటు వేసింది. అదేవిధంగా పద్ధతులపై విఘాతం కలిగించే విధంగా జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోకపోవడం పై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పై తీవ్రంగా ఆగ్రహించింది. ఎస్పీ బిందు మాత్రం సస్పెండ్ చేసింది. శాఖపరమైన విచారణ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా, నియోజకవర్గాలలో జరుగుతున్న దాడుల విషయమై స్థానికంగా ఉన్న సిఐలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జిల్లా పాలనయంత్రంగానికి సంబంధించిన కలెక్టర్, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రకంపన ప్రకంపన రేపింది.
