తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులను విస్తరణ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మొదటి విడతలో నిజామాబాద్ కు ప్రాధాన్యం ఇవ్వలేకపోయారు. రానున్న క్యాబినెట్ విస్తరణలో నిజామాబాద్ కు అవకాశం దక్కుతుంది. నిజాంబాద్ జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు మాత్రమే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బోధన్ నియోజకవర్గ నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గెలుపొందగా, నిజామాబాద్ రూరల్ నుండి భూపతి రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. క్యాబినెట్ విస్తరణలో బోధన్ నుండి ప్రాతినిధ్యం ఇస్తున్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందని నిజాంబాద్ జిల్లా ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్ను విస్తరించాలని
సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర
కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు. బీసీ,
ముదిరాజ్, మైనారిటీ వర్గాలతో కలిపి నలుగురికి
అవకాశమివ్వాలని రేవంత్ యోచిస్తున్నారు.ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికి
ప్రాధాన్య మిచ్చే అవకాశం ఉంది. తొలి మంత్రివర్గంలో
చోటు దక్కని సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నట్లు
సమాచారం.
త్వరలో కేబినెట్ విస్తరణ?నిజామాబాద్ కు తీపి కబురు
RELATED ARTICLES
