Wednesday, February 18, 2026

మున్సిపల్ డ్రైవర్ల ఆందోళన

ద్రోణ నిజామాబాద్ బ్యూరో

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని అనేకమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో ఉదయం నుండి మున్సిపల్ డ్రైవర్లు అంతా విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా పెట్రోల్ బంక్ యజమానులు మున్సిపల్ వాహనాల్లో వేసే పెట్రోల్ రసీదులను డ్రైవర్లే డబ్బులు చెల్లించి పుస్తకాలను తీసుకెళ్లాలని అదేవిధంగా కంప్యూటర్ బిల్లు పొందటానికి కావలసిన పేపర్ కొనుగోలుకు డ్రైవర్లే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇటీవల ఒక డ్రైవర్ పైన పెట్రోల్ బంక్ నిర్వాహకులు దాడి చేయడం జరిగింది.

అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాల రిపేరుకు లక్షల రూపాయలు ప్రైవేట్ మెకానిక్ షాప్ లో తీసుకుంటున్నారని తక్కువ ఖర్చులో వాహనాల మెయింటెనెన్స్ కొనసాగించుకోవటానికి మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అదేవిధంగా మున్సిపల్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేయి రూపాయల వేతనాన్ని అందించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.మూడు నెలలు ఇచ్చి వాపోస్ తీసుకోవడం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుపుతున్నప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ లో మాత్రం కేవలం డ్రైవర్లకు మాత్రమే ఇవ్వటం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన కార్మికులకు ఇరు వేల రూపాయలు దహన సంస్కారాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం నిజామాబాద్ కార్పొరేషన్ లో అమలు చేయడం లేదు.

దశాబ్దాల పాటు పనిచేసిన కార్మికులకు కార్మికులే కొంత జమ చేసుకొని చెల్లిస్తున్నారని ఈ రకమైన నిర్లక్ష్యం అధికారులు వీడి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్ల యూనియన్ నాయకులు భూపతి ఏకనాథ్ , సంతోష్ గౌడ్, కిరణ్ మరియు లక్ష్మణ్ ,మహేష్ తదితరులతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular