ద్రోణ హైద్రాబాద్ బ్యూరో
హైదరాబాద్ :సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* అధ్యక్షతన జరిగిన జాతీయ రహదారి “హైదరాబాద్ – విజయవాడ” (NH-65) పై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన ఈఎన్సీ గణపతి రెడ్డి, జీయర్ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్ మరియు హాజరైన జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర రహదారుల శాఖ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
RRR (ఆర్ ఆర్ ఆర్) రాష్ట్ర భవిష్యత్తును మార్చే సూపర్ గేమ్ ఛేంజర్.
RRR (ఆర్ ఆర్ ఆర్) ను త్వరితగతిన పూర్తిచేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.
హైదరాబాద్ – విజయవాడ (ఎన్.హెచ్-65) జాతీయ రహదారిపై ఉన్న పది హేడు బ్లాక్ స్పాట్స్ పై అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రమాద సూచీకల ఏర్పాటు, అతివేగం కట్టడికి తీసుకోవల్సిన చర్యలు, అవసరం ఉన్నచోట ఆరు ఏండ్లుగా రోడ్డు విస్తరణ, జంక్షన్ ల అభివృద్ధి, వి యు పి (వెహికిల్ అండర్ పాస్) ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల ఏర్పాటు వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో రహదారులను యాక్సిడెంట్ ఫ్రీ గా మారుస్తాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను కూడా త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్ధేశం చేయడం జరిగింది.
