ద్రోణ హైదరాబాద్ బ్యూరో
హై కోర్టు ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం.2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుండి ప్లాట్ కొనుక్కున్న ఎన్టీఆర్. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్ట్ గెజ్ ద్వారా లోన్స్ పొందిన గీతలక్ష్మి కుటుంబం.
3/4 బ్యాంక్ లనుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ పొందిన గీత లక్మి.
జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టిన గీత లక్ష్మి.
ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ పొందిన గీత లక్ష్మి.కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిన గీత లక్ష్మి.చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్న తారక్.2003 నుండి ప్లాట్ ఒనర్ గా తారక్.అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో కొనసాగుతున్న వివాదం.
ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బ్యాంక్ మేనేజర్లు.
బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జూనియర్ ఎన్టీఆర్.
2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్.
తాజాగా డి ఆర్ టి లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్.
దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమన్న హై కోర్టు.జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు.
