సంగారెడ్డి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతూ ముగ్గురు మృతి చెందారు. బైక్ అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్ పల్లి వద్ద 161 వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మదునూరు మండలం పెద్దతడుగుర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో శ్రీనివాస్, సునీత, నగేష్ మృతి చెందారు.
