ద్రోణ నిజామాబాద్ బ్యూరో
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మగ మృతదేహం లభించింది. వయసు అందాజ 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతదేహం పూర్తిగా కూలిన స్థితిలో ఉంది సుమారుగా వారం రోజుల క్రితం చనిపోయినట్లుగా కనబడుతున్నదనీ కామారెడ్డి రూరల్ సీఐ, దేవునిపల్లి ఎస్సై ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తుపట్టడానికి ఆనవాళ్లుగా మెడలో చిన్న తాయత్తు నల్లటి దారంతో ఉంది. మొలతాడు నల్లది కలదు. అదేవిధంగా కుడిచేతి ఉంగరపు వేలుకు రాగి ఉంగరం కలదు. ఎవరైనా మిస్సింగ్ అయినా గాని లేదా ఈ ఆనవాళ్ళతో గుర్తుపట్టినట్లయితే ఈ క్రింది నంబర్ కి సమాచారం అందించగలరు.
కామారెడ్డి రూరల్ సీఐ
8712 686 148
దేవునిపల్లి ఎస్ఐ
8712686150.
