Wednesday, February 18, 2026

డిగ్రీ పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించాలి

డిగ్రీ పరీక్షల ఏర్పాటు సిద్ధం

నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య యాదగిరి తెలిపారు. ఆయా కళాశాల పరీక్ష కేంద్రాలలో చీఫ్ సూపర్డెంట్ గా వ్యవహరించే వారు పేపర్ డౌన్లోడ్ చేసే సమయానికి పరీక్షా కేంద్రంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జీప్ సూపర్డెంట్ లకు ఏవైనా అనివార్య కారణాలు అత్యవసర పనులు ఉంటే అక్కడ ఉన్న ఇన్చార్జి లకు అధికారికంగా లిఖితపూర్వక బాధ్యతలు అప్పగించాలని సూచించారు ఇదే విషయాన్ని సూపర్డెంట్ పరీక్షల విభాగం అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు విధులలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు శుక్రవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్ష కేంద్రాలలో అకాడమీ ఆడిట్ సెల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల ఇరువై ఓకటి నుండి జూన్ పదిహేను వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముపై ఏనిమిది కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు నాలుగు ఆరు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు దాదాపు ఇరవై నాలుగు వేల మంది ఒకటి మూడు ఐదు సెమిస్టర్ బ్యాంక్ పరీక్షల కు పద్నలుగు వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఎలాంటి లోసుగులు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలుతున్నట్లు తెలిపారు.

పరీక్షా పత్రం డౌన్లోడ్ చేసే సమయంలో యూనివర్సిటీ నియమించిన అబ్జర్వర్ తో పాటు ప్రిన్సిపల్ లేదా చీప్ సూపరింటెండెంట్ తప్పనిసరి ఉండాలని ఈసారి పరీక్షలకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఇన్విజిలేటర్ సెల్ ఫోన్లు వినియోగించకూడదని ఈ సమావేశం పై ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ప్రైవేటు ప్రిన్సిపల్ మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆయన ప్రిన్సిపల్ నుండి విచారణ కోరాలని ఆడిట్ సెల్ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో పరీక్ష నియంత్రణ అధికారి ఆచార్య అరుణ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ జాయింట్ డైరెక్టర్ అతి సుల్తాన్ గోరి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular