అకాల వర్షాలకు వరి ధాన్యం కొంతవరకు తడిసిందని అయినప్పటికీ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రాబోయే సీజన్ నుండి పంటల బీమాను ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లిస్తుందని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రైతులు ఆందో చెందాల్సిన అవసరం లేదు, తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ను వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ములుగు జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ని వ్యవసాయ శాఖఅధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
