ద్రోణ నిజామాబాద్ బ్యూరో
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ సిపిఎం డిమాండ్ చేస్తుంది.కురిసిన ఆకాల వర్షాలకు వరి పంట ధాన్యం తడిసిపోయి మొలకలు ఎత్తటంతో రైతాంగం తీవ్ర నష్టపోతున్నారు పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో రైతంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను నష్టాన్ని అంచనా వేయటానికి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులను పంపిసర్వే చేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తార్చారం చేస్తే రైతంగం తీవ్ర నష్టపోతారని ఆయన అన్నారు . ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు మరియు నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
