Thursday, February 19, 2026

ఎంసెట్ లో 114 ర్యాంకు సాధించిన పెర్కిట్ ఆణిముత్యం

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన దువ్వూరి జ్యోతి సమన్విత్ ఎంసెట్లో 114 ర్యాంకు సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు సాధించినట్లు విద్యార్థి తల్లిదండ్రులు దువ్వూరి లక్ష్మి రాజ్యం, మహేందర్ లు తెలిపారు. దువ్వూరి జ్యోతి సమన్విత్ ప్రాథమిక విద్యాభ్యాసం పెర్కిట్లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో కొనసాగింది. సెకండరీ పాఠశాల విద్యాభ్యాసం కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతిలో చేశాడు. సమన్విత్ కు పదవ తరగతిలో 583 మార్కులు రాగా, హైదరాబాద్ లోని నారాయణ కళాశాలలో చదివిన ఇంటర్ లో 985 మార్కులు సాధించాడు. జేఈఈ మెన్స్ లో 112వ ర్యాంకు సాధించగా, ఇప్పుడు జరిగిన ఎంసెట్ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 114 ర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థి తండ్రి మహేందర్ ప్రస్తుతం తొర్లికొండ లో ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎంసెట్ లో 114 ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular