ద్రోణ నిజామాబాద్ బ్యూరో
పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలమాలల వేసే నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అని అందుకు వర్గ పోరాటాలు నిర్మించి ఈ వ్యవస్థను మార్చినప్పుడే అది సాధ్యమవుతుందని ఆనాడే నిరూపించిన మహానుభావుడని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మించి , వ్యవసాయ కార్మిక సంఘాన్ని, రైతాంగ ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాలను నిర్మించటంలో తను ప్రధాన భూమిక పోషించారని వెట్టి చాకిరి బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా భూస్వాములకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం లో ఆయన కృషి అమోఘం అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాల భూములను భూస్వాములనుండి స్వాధీనం చేసుకుని పేదలకు పంచడంలో కీలక పాత్ర పోషించారని కుల, మత ,ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి ఈ వ్యవస్థను ఏకతాటి మీదికి తీసుకురావడంలో ఆయన కృషి నేటికీ ఆదర్శంగా ఎంతోమంది పేదల బతుకులో వెలుగులు పెంచారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పనిచేసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు ,నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, సుజాత, విగ్నేష్, లింగం మరియు నగర నాయకులు కటారి రాములు, నరసయ్య, అనసూయమ్మ, అనిత, ఉద్ధవ్, దీపిక, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
