Thursday, February 19, 2026

రైతులు అధైర్య పడవద్దు అండగా ఉంటాం.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే: కొనుగోలు చేస్తుంది.
రైతులు ఆందోళన చెందవద్దు.చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే:

రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని నాణ్యత లోపం పేరుతో రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కటింగులు చేయరాదని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular