Thursday, February 19, 2026

బాన్సువాడలో మహిళ, బాలుడి మృతదేహాలు

బాన్సువాడ పట్టణంలోని న్యూ వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మాణం అవుతున్న భవంతిలో 30 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళా మృతదేహం మరియు 6 నుంచి 8 సంవత్సరాలు కలిగిన బాలుడు మృతదేహాలను ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తించినట్లు బాన్సువాడ పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. గుర్తుతెలియని కుళ్లిపోయిన రెండు మృతదేహాలను న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలోని ఒక షెటర్లో ఒక మహిళ మరియు ఒక బాలుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, మహిళ మరియు బాలుడు మృతి చెంది మూడు నుంచి నాలుగు రోజులు అయి ఉండవచ్చునని తెలిపారు. మృతి చెందిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఒంటిపై లేత గోధుమ రంగు టాప్ మరియు నలుపు రంగు పాయింటు దుస్తులు ధరించి, ఎత్తు ఐదు ఫీట్ల పొడవు కలిగి ఉన్నాడని మరియు బాలుడు ఆకుపచ్చ టీ షర్ట్ మరియు కాషాయం రంగు కలిగిన నిక్కర్ ఉన్నదని తెలిపారు. మృతదేహాలను బాన్సువాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఎవరైనా మృతదేహాల వివరాలు తెలిసినవారు బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular