అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం (ఏ ఐ పి కే యస్ ) బోధన్ మండల అధ్యక్షులు పడాల శంకర్
2024 ఖరీఫ్ సీజన్ కి రైతాంగానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించాలని మరియు రైతు రుణాలను ఏకకాలంలో రెండు లక్షలు మాఫీ చేయాలని నూతన రుణాలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఏ ఐ పి కే యస్ ( A I P K S )బోధన్ మండల అధ్యక్షుడు పడాల శంకర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం బోధన్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఏ ఐ పి కే యస్ (A I P K S )బోధన్ మండల అధ్యక్షుడు పడాల శంకర్ మాట్లాడుతూ 2024 ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు చేయుటకు రైతాంగం సిద్ధమవుతున్నారని అయితే ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన అన్ని రకాల విత్తనాలు కాకుండా కేవలం జనుము, జీలుగు విత్తనాలను మాత్రమే పంపిణీకి సిద్ధం చేసిందని వీటితోపాటు అన్ని రకాల విత్తనాలు,ఎరువులు, పురుగు మందులు వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు మినీ ట్రాక్టర్ యాబై శాతం సబ్సిడీతో ఇవ్వాలని దళిత, గిరిజన, చిన్న, సన్నా కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలని ఏ ఐ పి కే (A I P K S) డిమాండ్ చేస్తుందన్నారు.రైతాంగానికి సకాలంలో విత్తనాలు రుణాలు అందించాలి దేశంలో అనేక దశాబ్దాల కాలం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు,విత్తనాలు, వేరువులు, పురుగుమందులు నాలబై శాతం కు పైగా సబ్సిడీతో ఇచ్చారని కానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నాశనం చేయటానికి ఉన్న సబ్సిడీలను రద్దు చేశాయి అని మండిపడ్డారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వరోగ నివారిణి లాగా రైతు బందును చూపించి రైతులను మోసం చేసిందన్నారు. కేవలం బ్యాంకు అప్పులు తీసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా పథకాన్ని వర్తింపజేశాయని, కేంద్ర ప్రభుత్వం పసల్ భీమా అందరికీ అని కొందరికి మాత్రమే వర్తింపజేశాయని ఆ విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో సర్వే చేసి బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా పంటల భీమా పథకాన్ని దాని ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాల నుండి పకృతి విలయతాండవం, వడగండ్ల వర్షంతో నష్టపోతున్న రైతులకు గత ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు చొప్పున కూడా ఇవ్వలేదని ప్రస్తుతం నష్టపోయిన అన్ని పంటలకు ఎకరాకు ఇరువై ఐదు వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ మండల ప్రధాన కార్యదర్శి సుల్తాన్ సాయిలు, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సీతారాం, మండల నాయకులు సిహెచ్. గంగయ్య, పి. పోశెట్టి,డి.పోశెట్టి, పి. రాములు,సిహెచ్. పోశెట్టి, బీమ్ రావ్, ఏ.గంగారాం, జి. లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

