భారతదేశానికి ప్రధానిగా కొనసాగిన రాజీవ్ గాంధీ ఆనాడు అత్యాధునిక టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి యువతకు మార్గదర్శకులుగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పట్టణంలోని సోమాజిగూడ లో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరువదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


