ద్రోణ బోధన్ ప్రతినిధి



కోటగిరి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డెలిగేట్ కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.కొట్టం మనోహర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ ఆరవ ప్రధానమంత్రి . 1984లో తన తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన 40 సంవత్సరాల వయస్సులో కూడా పదవీ బాధ్యతలు స్వీకరించిన అతి పిన్న వయస్కుడైన భారత ప్రధాని. డిసెంబర్ 2, 1989 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పనిచేశాడు.రాజీవ్ గాంధీ హత్య 32 ఏళ్ల క్రితం మే 21న శ్రీపెరంబుదూర్‌లో గాంధీ హత్యకు గురయ్యారు. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు చెందిన మహిళ గాంధీని చంపిన ప్రధాన హంతకురాలు. శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో, మహిళ మాజీ ప్రధాని పాదాలను తాకి, తన దుస్తులకు దిగువన ఉంచిన ఆర్డిఎక్స్ పేలుడు పదార్థంతో కూడిన బెల్టును పేల్చింది. హంతకుడు శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన తేన్మొళి రాజరత్నం అలియాస్ ధనుగా గుర్తించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువారని యువతకు ఆయన ఆదర్శప్రాయులని కొనియాడారు. కార్యక్రమం లో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, సలీం, సాయిలు, ఆనంద్, గంగాధర్ దేశాయ్, కొత్తపల్లి విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, గంగారం, బర్ల మధు, మాజీ జెడ్పిటిసి శివరాజ్ దేశాయ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
