ద్రోణ బోధన్ ప్రతినిధి
వైద్యం కోసం ప్రభుత్వం ఆసుపత్రులను ఆశ్రయించే వారికి సరైన చికిత్సలు అందించాలని వైద్యులు సిబ్బంది సమయం పాలన పాటించాలని లేకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ హెచ్చరించారు. బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని పెగడపల్లి సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై అనేక ఆరోపణలు రావడం పై జిల్లా వైద్యాధికారి స్పందించి ఆసుపత్రుల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రులలో టిఆర్ఎస్ తో పాటు ఫ్లూయిడ్స్ తప్పకుండా అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు.

ప్రసూతి వైద్య చికిత్సలను మెరుగుపరచాలని ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ సంఖ్యను మరింత పెంచాలని జిల్లా వైద్యాధికారి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సరైన వైద్యం అందించి, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీఎంహెచ్వో డాక్టర్ విద్య, సిబ్బంది రవి తదితరులు ఉన్నారు.
