నాకు నా రాజీవ్ ని తిరిగి ఇవ్వండి నేను తిరిగి వెళ్లిపోతాను అలా తిరిగి ఇవ్వకపోతే నన్ను కూడా తాను కలిసిన ఈ మట్టిలోనే కలిసి ఇక్కడే చనిపోనివ్వండి.
సోనియా గాంధీ
ఏం జరిగిందో మీకు తెలియదు.నేను ఎలా కలిసానో కూడా తెలియదు.ఆ చిరునవ్వు, ఎత్తు,ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఆ కళ్ళు, ఆ తేజస్సు. నేను మొదటి సారి తనని చూసినప్పుడు ఎంత సేపు చూసానో నాకే తెలియదు నాతోటి మిత్రుణ్ణి అడిగాను ఇంత అందంగా వున్నాడు ఎవరు ఈయన అని. అతడు భారతీయుడు, పండిట్ నెహ్రు కుటుంబం అని సమాధానం చెప్పాడు. నేను అలానే చూస్తూఉండిపోయాను
మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు, ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆ రోజులు ఎంత సంతోషంగా వుండెనో, అదొక స్వర్గం. మేము నదుల వెంట తిరుగుతూ, కారులో డ్రైవ్ చేసుకుంటూ, చేతులలో చేతులతో వీధుల్లో నడుస్తూ, సినిమాలు చూసాం. మేము ఒకరికొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తు లేదు అయినా అవసరం లేదు, ప్రతిదీ సహజమైనది, మేము ఒకరికోసం ఒకరు పుట్టారనుకున్నాం. అప్పుడే మేము కలిసి జీవించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకొన్నాం.
