Thursday, February 19, 2026

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి కి అపూర్వస్పందన

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

ఖమ్మం- వరంగల్- నల్గొండ పట్టభద్రుల మిల్క్ ఉపఎన్నికల్లో భాగంగా సత్తుపల్లి పట్టణంలోని వివిధ విద్యాసంస్థల మేనేజ్మెంట్ వారిని, ప్రిన్సిపాల్ ను ,బ్యాంకు ఉద్యోగస్తులను ,వివిధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులను కలిసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరినప్పుడు , అపూర్వస్పందన లభించిందని రానున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లా పూర్వ అధ్యక్షులు మరియు సత్తుపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ బాణాల లక్ష్మారెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు అన్నారు. వారు మాట్లాడుతూ పోటీ చేస్తున్న అభ్యర్థుల అందరిలో క్లీన్ చిట్ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అని ఉద్యోగస్తులు నుండి నిరుద్యోగుల నుండి వినిపిస్తున్న మాటయని ,గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి ఓటు వేయబోతున్నారని వారన్నారు.

పట్టభద్రుల నుంచి అనూహ్యమైన పాజిటివ్ స్పందన బిజెపి అభ్యర్థికి లభిస్తుందని అన్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ బిజెపి అభ్యర్థికి ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నందున బిజెపి శ్రేణులు ఆ దిశగా కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు,సత్తుపల్లి పట్టణ , మండల అధ్యక్షులు ఆచంట నాగ స్వామి ,పాలకొల్లు శ్రీనివాస్ , సుదర్శన్ మిశ్రా , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular