ద్రోణ నిజాంబాద్ బ్యూరో
రోటరీ క్లబ్ అఫ్ ఆర్మూర్ ఆధ్వర్యములో అధ్యక్షులు గోపి కృష్ణ పట్వారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమములో భాగంగా విశేష సేవలందిస్తున్న వారిని సన్మానించారు. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు ఖాందేశ్ సత్యం- లత దంపతులకు వారు రోటరీ లో చేస్తున్న సేవలకు, ఆర్మూర్ పట్టణములోని 2 వ వార్డులో చేస్తున్న సేవలను గుర్తించి వారిని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ నివాసి పదవి విరమణ పొందిన ఐఏఎస్ విక్రం సింహా రావు (న్యూఢిల్లీ) శాలువా పూల బొకే తో పాటు మెమోంటోతో ఘనంగా సన్మానము చేశారు.
