ద్రోణ నిజాంబాద్ బ్యూరో
వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ డిప్యూటీ డిఎంహెచ్వో రమేష్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ మరియు పిప్రి గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని ప్రతి చిన్నారికి టీకాలు అందే విధంగా ఆశా కార్యకర్తలు చూడాలని ఆదేశించారు. ఎండలు అధికంగా ఉన్నందున వ్యాక్సిన్ కోల్డ్ చైల్డ్ పాటించాలని సూచించారు. జిల్లా ఆరోగ్య ఉప వైద్యాధికారి డాక్టర్ రమేష్ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు అధికంగా అయ్యేవిధంగా చూడాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలని ఆదేశించారు.

రాబోయేది వర్షాకాలం కాబట్టి ఇప్పటి నుండే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వారి వెంట ఆర్మూర్ సబ్ యూనిట్ అధికారి సాయి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గర్భిణి స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
