Thursday, February 19, 2026

10/10 జిపిఏ సాధించిన విద్యార్థికి సన్మానించిన ఎన్.ఎస్.యు.ఐ నాయకులు…

టెన్ జిపిఏ సాధించిన విద్యార్థిని సన్మానిస్తున్న ఎన్.ఎస్.యు.ఐ నాయకులు..

(భీమ్‌గల్ రూరల్,) ద్రోణ మే 21

విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు పదవ తరగతి నుండి పునాది పడుతుందని పదవ తరగతిలో ఉత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ అన్నారు.ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో భీమ్‌గల్ పట్టణం లోని బోయ గల్లీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 సాధించిన కొఠారి అపూర్వ తో పాటు మిగతా విద్యార్థులకు ఎంఈఓ డి.స్వామి పాఠశాల ఉపాధ్యాయులు లింబాద్రి రాములు వినోద్ సమక్షంలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ. ఉన్నత విద్య కు మార్గం పదో తరగతి ఫలితాలని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచి భీమ్‌గల్ ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకువచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అలాగే విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసి వారికి విద్యార్థులు నేర్పి వారి ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టిన పాఠశాల ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, అలాగే భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు ఇదేవిధంగా కృషిచేసి ప్రభుత్వ పాఠశాలను రాష్ట్రస్థాయిలో ఉన్నత పాఠశాలగా దిద్దాలని అలాగే విద్యార్థులు కూడా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని నీతి నియమాలు విలువలతో కూడిన విద్యను అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ ప్రధాన కార్యదర్శి మొండి దినేష్ మరియు భీమ్‌గల్ మండల ఎన్.ఎస్.యు.ఐ ఉపాధ్యక్షులు గౌరు ప్రశాంత్ మరియు ఎన్.ఎస్.యు.ఐ నాయకులు సుధీర్,వినయ్, పవన్, శ్రీకాంత్, నితిన్, రిషి, రాము, రిశ్వంత్, హైమద్ ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular