Thursday, February 19, 2026

మండుటెండలో అప్పడం కాల్చిన జవాన్

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో ఆ తీవ్రత ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో ఒక జవాన్ ఇసుకలో అప్పడాన్ని కాల్చుతున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది..దీనిని షేర్ చేస్తూ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు.సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ ఒకరు రాజస్థాన్‌లోని బికనేర్ విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అతడు ఒక అప్పడాన్ని తీసుకొని దానిపై ఇసుక కప్పేశారు. కొద్దిసేపటి తర్వాత, ఇసుకను తొలగించి దానిని తీసి చూస్తే.. అచ్చం స్టవ్‌ మీద వేయించినట్టుగా కనిపించింది. అప్పుడు ఆ ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల మేర ఉంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియో సీఎం హిమంత బిశ్వశర్మ దృష్టిలో పడింది. ”ఎలాంటి అసాధారణ పరిస్థితులకైనా వెరవకుండా, దేశం కోసం సేవలు అందిస్తోన్న జవాన్లను చూసి.. నా హృదయం కృతజ్ఞత, గౌరవంతో నిండిపోయింది” అని బీఎస్‌ఎఫ్ ఇండియాను ట్యాగ్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సైనికులపై తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేస్తున్నారు. హీట్‌వేవ్‌ను పట్టించుకోకుండా సైన్యం తన విధులు నిర్వర్తిస్తోందని కొనియాడారు. రాజస్థాన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతాల్లో బికనేర్ కూడా ఒకటి. ఈసారి అక్కడ 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular