Thursday, February 19, 2026

ఏ సి బి వలలో కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి

ద్రోణ కాకినాడ బ్యూరో

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ. మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు.
కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ రూ.2 లక్షలు మురళి డిమాండ్ చేశారు.
బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండ్‌గా అధికారులు పట్టుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular