ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీషబ్బీర్
దేవుని ముందు అందరూ సమానులే అని,లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి నన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ సలహాదారు.
నరసింహస్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని,ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నాను అన్నారు.కాంగ్రెస్ హయాంలో దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగిందని చెప్పారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం షబ్బీర్ అలీ సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మద్య ఘనంగా జరిగింది.
అందరూ ఆ దేవుడిని దర్శించుకొని, తరించాలని సూచించారు. మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడు, అందుకే దేవుడు అందరివాడు అన్నారు. దైవ సన్నిధి ఆనందాన్ని పెంచుతుందని, అందరికి పంచుతుంది తెలిపారు.
ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకున్న ఆలయ కమిటీకి గ్రామ ప్రజలకు అభినందనీయులు అని అన్నారు. ప్రజలందరూ స్వామి వారి దయతో నాతో తీసుకోవాల్సిన పనులు ముస్లిం అని చూడకుండా నాకు అవకాశం ఇస్తున్నాడని పేర్కొన్నారు. రైతులకు గిరిజనులకు దళితులకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు వెళ్లాలన్నారు.
స్వామివారి దయతో మీ అందరి అండదండలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందం.
